China: చైనాను వణికిస్తున్న మరో ఫ్లూ.. లాక్‌డౌన్ యోచనలో ప్రభుత్వం!
- విపరీతంగా పెరుగుతున్న కేసుల సంఖ్య
- జియాన్‌లో లాక్‌డౌన్ యోచన
- వద్దేవద్దంటున్న అధికారులు
కరోనా వైరస్‌తో అల్లాడిపోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పొరుగుదేశం చైనాను ఇప్పుడు మరో ఫ్లూ వేధిస్తోంది. ఈ కొత్త ఫ్లూ కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతుండడంతో ప్రభుత్వం లాక్‌డౌన్ యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల మొదటి వారంలో 25.1 శాతంగా ఉన్న కేసుల సంఖ్య ప్రస్తుతం 41.6 శాతానికి పెరిగింది. అయితే, కరోనా కేసులు మాత్రం 5.1 శాతం నుంచి 3.8 శాతానికి తగ్గడం ఊరటనిచ్చే విషయం.
జియాన్ నగరంలో ఫ్లూ కేసులు పెరగడంతో వాణిజ్య ప్రాంతాలు, పాఠశాలలు, రద్దీ ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించాలని ప్రభుత్వం యోచిస్తుండగా, అలాంటి పని చేయొద్దంటూ ప్రజలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరోవైపు, మన దేశంలోనూ పలు రాష్ట్రాల్లో ఇన్‌ఫ్లుయెంజా వైరస్ కేసులు పెరుగుతుండడంతో అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను హెచ్చరించింది.