MLC Elections: రేపు ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం

All set for MLC elections in AP

  • మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికలు
  • 3 పట్టభద్రుల, 2 ఉపాధ్యాయ, 3 స్థానిక సంస్థల స్థానాలకు పోలింగ్
  • అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు ఈసీ వెల్లడి
  • 5 స్థానిక సంస్థల స్థానాలు ఏకగ్రీవం అయ్యాయన్న మీనా

ఏపీలో రేపు (మార్చి 13) ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. 9 జిల్లాల పరిధిలో 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు, 2 ఉపాధ్యాయ, 3 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. 

రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందని సీఈసీ ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. ఈ నెల 16న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారని వివరించారు. ఇప్పటికే 5 ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని మీనా వెల్లడించారు. 

ఎమ్మెల్సీ ఎన్నికలకు మొత్తం ఓటర్లు 10,56,720 మంది అని వివరించారు. వారిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లు 10 లక్షల 519 మంది అని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు 55,842 మంది అని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓటర్లు 3,059 మంది అని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మొత్తం 1,538 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ముఖేశ్ కుమార్ మీనా చెప్పారు.

MLC Elections
Graduate
Teachers
Local Body
Andhra Pradesh
  • Loading...

More Telugu News