Nallari Kiran Kumar Reddy: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

Former CM Nallari Kiran Reddy resigns to Congress party

  • ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం
  • కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన కిరణ్ కుమార్
  • తన రాజీనామా ఆమోదించాలని విజ్ఞప్తి
  • ఆ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడికి లేఖ

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని, తన రాజీనామాను ఆమోదించాలంటూ కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడికి లేఖ రాశారు. కిరణ్ కుమార్ బీజేపీలో చేరతారంటూ ఇటీవల కథనాలు వచ్చాయి. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పడంతో ఆ కథనాలకు బలం చేకూరుతోంది. 

ఇటీవల ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందిస్తూ... కిరణ్ కుమార్ ఎంతో చురుకైన నాయకుడు అని, పార్టీలోకి వస్తే సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని అన్నారు. కిరణ్ వంటి నేత వస్తే, ఏపీలో బీజేపీ బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రి. రాష్ట్ర విభజన సమయంలో జై సమైక్యాంధ్ర పార్టీ ఏర్పాటు చేశారు. 2014 ఎన్నికల తర్వాత ఆయన రాజకీయంగా తెరమరుగయ్యారు.

Nallari Kiran Kumar Reddy
Congress
Resignation
Andhra Pradesh
  • Loading...

More Telugu News