CM KCR: సీఎం కేసీఆర్ కు పొత్తికడుపులో అల్సర్ ఉన్నట్టు గుర్తించాం: ఏఐజీ వైద్యులు

AIG doctors statement on CM KCR health

  • గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి వచ్చిన సీఎం కేసీఆర్ దంపతులు
  • ఏఐజీ చైర్మన్ ఆధ్వర్యంలో కేసీఆర్ కు వైద్య పరీక్షలు
  • ప్రకటన విడుదల చేసిన ఏఐజీ వైద్యులు

తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు ఇవాళ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లడం తెలిసిందే. దీనిపై ఏఐజీ వైద్యులు స్పందించారు. సీఎం కేసీఆర్ కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చారని వెల్లడించారు. ఆయనకు పొత్తికడుపులో అసౌకర్యం ఏర్పడిందని తెలిపారు. సీఎం కేసీఆర్ కు ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి నేతృత్వంలో వైద్య పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించారు. 

ఎండోస్కోపీ, సీటీ స్కాన్ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. సీఎం కేసీఆర్ కు పొత్తికడుపులో అల్సర్ ఉన్నట్టు గుర్తించామని వైద్యులు వెల్లడించారు. మిగతా వైద్య పరీక్షల ఫలితాలు సాధారణంగానే వచ్చాయని వివరించారు. ఈ మేరకు బులెటిన్ విడుదల చేశారు.

CM KCR
AIG Hospital
Ulcer
Health
Hyderabad
BRS
Telangana
  • Loading...

More Telugu News