Vijay Devarakonda: విజయ్ దేవరకొండ గురించి సమాధానం చెప్పలేక చచ్చిపోయేదాన్నంటున్న యువ నటి

Malvika Nair talks about vijay devarakonda

  • ఎవడే సుబ్రమణ్యం చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయిన మాళవిక నాయర్
  • ఆ చిత్రం తర్వాత హైదరాబాద్ లో డిగ్రీ పూర్తి చేసిన నటి
  • ఈ నెల17న విడుదలవుతున్న ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి 

‘ఎవడే సుబ్రమణ్యం’తో టాలీవుడ్ లో అడుగు పెట్టిన మలయాళ నటి మాళవిక నాయర్. ఆ చిత్రం చేస్తున్నప్పుడు ఆమె వయసు 17 సంవత్సరాలు. ఢిల్లీలో ఇంటర్‌ చదువుతున్న ఆమె మొదటి ఏడాది వేసవి సెలవుల్లో ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొన్నది. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు చదువూ కొనసాగించింది. పైలెట్‌ కావాలని కలలు కన్నా.. వరుస సినిమాల వల్ల దాన్ని పక్కన పెట్టేయాల్సి వచ్చిందని మాళవిక చెబుతోంది. ఢిల్లీలో ఇంటర్ తర్వాత హైదరాబాద్ బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో ఆమె డిగ్రీ పూర్తి చేసింది.

అప్పటికే పలు సినిమాలు చేసినా.. ఆ సమయంలో కాలేజీలో తన స్నేహితులంతా విజయ్‌ దేవరకొండ గురించే అడిగేవారని మాళవిక చెప్పింది. వాళ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చచ్చిపోయేదాన్ని అని వెల్లడించింది. ఎవడే సుబ్రమణ్యం తర్వాత కళ్యాణ వైభోగమే, టాక్సీవాలా చిత్రాల్లో తన నటనతో మాళవిక తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇప్పుడు నాగశౌర్య సరసన ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది.

More Telugu News