Nagashourya: ఇది డప్పుకొట్టుకోవడం కాదు: హీరో నాగశౌర్య

Phalana Abbayi Phalana Ammayi Pre Release Event

  • ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'
  • అవసరాల దర్శకత్వంపై నమ్మకం ఉందన్న నాగశౌర్య
  • మరో బ్లాక్ బస్టర్ ఖాయమని చెప్పిన హీరో 
  • తమ కష్టం చెప్పుకోవడం తప్పుకాదని వ్యాఖ్య  


నాగశౌర్యకి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆయన సినిమాలకి మంచి ఆదరణ ఉంది. అందునా శ్రీనివాస్ అవసరాలతో సినిమా అనగానే అందరూ కూడా ప్రత్యేకమైన దృష్టి పెడుతుంటారు. అలా అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్న సినిమానే 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'. ఈ నెల 17వ తేదీన థియేటర్లకు వస్తున్న ఈ సినిమా కొంతసేపటి క్రితం ప్రీ రిలీజ్ ఈవెంటును జరుపుకుంది. 

ఈ స్టేజ్ పై నాగశౌర్య మాట్లాడుతూ ... " ఈ సినిమా చూసిన తరువాత ఇంతకుముందు మా కాంబినేషన్లో వచ్చిన సినిమాలను మరిచిపోతారు. అంతలా  ఈ సినిమా మరిపిస్తుంది. అవసరాల దర్శకత్వంపై నాకు నమ్మకం ఎక్కువ. రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన మేము, మూడో బ్లాక్ బస్టర్ తప్పకుండా కొడతాము" అన్నాడు.  

" సినిమా గురించి మేము మాట్లాడితే డప్పు కొట్టుకుంటున్నారు అనుకుంటారు. కానీ మేము డప్పు కొట్టుకోము. ఒక సినిమా కోసం ఎంత కష్టపడ్డామనేది మీకు చెప్పవలసింది మేమే కదా. అవసరాల ఎప్పుడూ కూడా హిట్టు గురించి గానీ .. ఫ్లాప్ గురించి గాని మాట్లాడరు. ఎప్పుడూ స్క్రిప్ట్ గురించే మాట్లాడటం ఆయన ప్రత్యేకత" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News