Nagashourya: చిన్న సినిమాను చిన్నచూపు చూడొద్దు : దర్శకుడు మారుతి

Phalana Abbayi Phalana Ammayi Pre Release Event

  • రొమాంటిక్ లవ్ స్టోరీగా ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'
  • ఈ నెల 17వ తేదీన విడుదలవుతున్న సినిమా 
  • హైదరాబాదులో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • నాగశౌర్య - మాళవిక జోడీ బాగుంటుందన్న మారుతి

నాగశౌర్య - మాళవిక నాయర్ జంటగా రొమాంటిక్ కామెడీ ఎంటర్టయినర్ గా 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' రూపొందింది. విశ్వప్రసాద్ - దాసరి పద్మజ నిర్మించిన ఈ సినిమాకి, అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. కల్యాణి మాలిక్ స్వరపరిచిన బాణీలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించారు. దర్శకుడు మారుతి .. బాబీ .. బీవీఎస్ రవి .. అడివి శేష్ హాజరయ్యారు. ఈ వేదికపై ట్రైలర్ ను రిలీజ్ చేశారు. హీరో .. హీరోయిన్స్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. 

ఈ స్టేజ్ పై మారుతి మాట్లాడుతూ .. "నాగశౌర్య - మాళవిక జోడీ చాలా బాగుంటుంది. అలాగే నాగశౌర్య - అవసరాల కాంబినేషన్ కూడా బాగా కుదురుతుంది. ఈ మధ్య కాలంలో మంచి మంచి చిన్న సినిమాలను ఆడియన్స్ మిస్సవుతున్నారు. చిన్న సినిమాను చిన్నచూపు చూడొద్దు. థియేటర్స్ కి వెళ్లి ఈ సినిమా చూడండి. తప్పకుండా మీకు నచ్చుతుంది" అన్నారు. 

More Telugu News