Tiger Seshadri: 'నటరత్నాలు' మూవీతో విలన్‌గా టైగర్ శేషాద్రి ఎంట్రీ... ఆసక్తి రేకెత్తిస్తున్న లుక్

Tiger Seshadri a new villain for Tollywood

  • సుదర్శన్, ఇనయ, టైగర్ శేషాద్రి ప్రధాన పాత్రల్లో 'నటరత్నాలు'
  • విలన్ గా పరిచయం అవుతున్న టైగర్ శేషాద్రి
  • శేషాద్రి లుక్ విడుదల చేసిన చిత్రబృందం
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'నటరత్నాలు'

ఏ సినిమాలో అయినా హీరో ఎలివేషన్ హైలైట్ కావాలంటే విలన్ క్యారెక్టర్ కూడా దీటుగా ఉండాలి. హీరో, విలన్ రోల్స్ బలంగా ఉంటే, ఆ ఇద్దరూ తలపడే సీన్స్ మూవీలో మేజర్ హైలైట్ అవుతుంటాయి. అలా ఇప్పటికే తెలుగు తెరపై ఎందరో విలన్స్ లైమ్ లైట్ లోకి రాగా.. తాజాగా టైగర్ శేషాద్రి అనే మరో విలన్‌ గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. టైగర్ శేషాద్రి 'నటరత్నాలు' అనే సినిమాతో విలన్ గా ఆయన పరిచయం కాబోతున్నారు.

'నటరత్నాలు' చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా విలన్ టైగర్ శేషాద్రి లుక్ రిలీజ్ చేశారు. గుబురు గడ్డంతో ఎంతో సీరియస్ లుక్ తో ఉన్న శేషాద్రి విలనిజం ఉట్టిపడేలా కనిపిస్తున్నారు. నుదుట పొడవాటి బొట్టు, మెడలో పులిగోర్లతో కూడిన లాకెట్ ఆయన అప్పియరెన్స్ ను స్పష్టం చేస్తున్నాయి. విలన్ కి ఉండాల్సిన సీరియస్‌నెస్, శరీర సౌష్టవం ఆయనలో కనిపిస్తున్నాయి. ఈ లుక్ చూస్తుంటే 'నటరత్నాలు' సినిమాలో టైగర్ శేషాద్రి విలన్ క్యారెక్టర్ హైలైట్ అవుతుందని తెలుస్తోంది. 

కామెడీ ప్రధానంగా రూపుదిద్దుకుంటున్న ఈ 'నటరత్నాలు' మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎవరెస్ట్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై చందన ప్రొడక్షన్స్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు డా. దివ్య నిర్మాతగా, ఆనందాసు శ్రీ మణికంఠ సహ నిర్మాతగా, యలమాటి చంటి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నర్రా శివనాగు దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాకు శంకర్ మహదేవ్ సంగీతాన్ని అందిస్తుండగా... సుదర్శన్, ఇనయ సుల్తానా, రంగస్థలం మహేష్‌, టైగర్ శేషాద్రి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్ డేట్స్ తో అంచనాలు మరింత పెరిగాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.

Tiger Seshadri
Villain
Natarathnalu
Tollywood
  • Loading...

More Telugu News