Nara Lokesh: ఎన్నికల కోడ్ నేపథ్యంలో లోకేశ్ పాదయాత్రకు బ్రేక్

Lokesh Yuvagalam gets break due to MLC Election Code

  • మదనపల్లి నియోజక వర్గంలో లోకేశ్ పాదయాత్ర
  • కంటేవారిపల్లిలో బస
  • ఎన్నికల కోడ్ అమల్లో ఉందన్న పోలీసులు
  • బస నుంచి వెళుతున్న లోకేశ్

ఏపీలో ఎల్లుండి (మార్చి 13) ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఎన్నికల కోడ్ ను గౌరవిస్తూ నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు విరామం ప్రకటించారు. మదనపల్లి నియోజకవర్గంలోని కంటేవారిపల్లి బస ప్రాంతం నుంచి వెళ్లిపోయేందుకు లోకేశ్ సిద్ధమయ్యారు. 

పోలీసుల విజ్ఞప్తితో లోకేశ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం కంటేవారిపల్లి నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాతే లోకేశ్ ఈ ప్రాంతానికి రానున్నారు.

More Telugu News