RRR: ప్రియాంక చోప్రాకు థ్యాంక్స్ చెప్పిన ఉపాసన.. ఎందుకంటే..!

Upasana thanks priyanka chopra

  • ప్రీ ఆస్కార్ పార్టీ ఇచ్చిన ప్రియాంక చోప్రా
  • పాల్గొన్న చరణ్ దంపతులు, ఎన్టీఆర్, భారత నటీనటులు
  • ప్రియాంకతో దిగిన ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేసిన ఉపాసన

ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచింది. ఈ చిత్రంలోని నాటు నాటు పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయింది. ఈ నెల 12వ తేదీన (భారత్ లో 13) లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్‌‌ లో అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. ఇక ఇప్పటికే హీరోలు రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి యూఎస్ లో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. హాలీవుడ్ లో సెటిల్ అయిన భారత నటి ప్రియాంక చోప్రా దక్షిణాసియా చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులకు ప్రీ ఆస్కార్ పార్టీ ఇచ్చారు. 

ఈ పార్టీకి రామ్ చరణ్, ఎన్టీఆర్ తో పాటు భారత సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రియాంక చోప్రాతో కలిసి రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఫొటో దిగారు. దీన్ని ట్విట్టర్ లో షేర్ చేసిన ఉపాసన.. ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. హాలీవుడ్ లో ఎల్లప్పుడూ తమ కోసం బాసటగా ఉన్న ఆమెకు థ్యాంక్స్ చెప్పారు.

RRR
Ramcharan
upasana
Priyanka Chopra
oscar

More Telugu News