Mohit Joshi: ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ మోహిత్ జోషి రాజీనామా.. టెక్ మహీంద్రాలో చేరిక!
- 2000 నుంచి ఇన్ఫోసిస్ లో ఉన్న మోహిత్ జోషి
- టెక్ మహీంద్రాలో ఎండీ, సీఈవోగా బాధ్యతల స్వీకరణ
- ఇన్ఫీకి ఆయన చేసిన సేవలు చాలా గొప్పవని కొనియాడిన బోర్డ్ డైరెక్టర్స్
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కు ఆ కంపెనీ ప్రెసిడెంట్ మోహిత్ జోషి రాజీనామా చేశారు. 2000 నుంచి ఆయన ఇన్ఫోసిస్ లో ఉన్నారు. ఇన్ఫీకి రాజీనామా చేసిన ఆయన టెక్ మహీంద్రాలో చేరారు. టెక్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా బాధ్యతలను చేపట్టారు. ఈ విషయాన్ని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ కు రెండు కంపెనీలు తెలిపాయి. మార్చ్ 11 నుంచి మోహిత్ జోషి లీవ్ లో ఉంటారని.... జూన్ 9వ తేదీ తమ కంపెనీలో ఆయనకు చివరి రోజు అని ఇన్ఫోసిస్ తెలిపింది. కంపెనీకి ఆయన చేసిన సేవలు చాలా గొప్పవని ఇన్ఫోసిస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కొనియాడారు.
ఇన్ఫోసిన్ ప్రెసిడెంట్ గా ఫైనాన్సియల్ సర్వీసెస్, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ బిజినెస్ ను మోహిత్ జోషి పర్యవేక్షించారు. గతంలో ఆయన ఏబీఎన్ ఆమ్రో, ఏఎన్ జెడ్ గ్రిండ్లేస్ సంస్థల్లో పని చేశారు. ఢిల్లీ యూనివర్శిటీలో ఆయన ఎంబీఏ చేశారు.