Team India: గిల్ జోరుతో ఆసీస్ కు దీటుగా బదులిస్తున్న భారత్

India take that first session with 93 runs

  • 129/1 స్కోరుతో లంచ్ విరామానికి వెళ్లిన ఆతిథ్య జట్టు
  • 32 పరుగులకు ఔటైన రోహిత్ శర్మ
  • అర్ధ సెంచరీతో ఆకట్టుకున్న శుభ్ మన్ గిల్

అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియాకు భారత్ దీటుగా బదులిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 480 పరుగుల స్కోరు చేయగా.. టీమిండియా సైతం భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఓవర్ నైట్ స్కోరు 36/0తో మూడో రోజు, శనివారం ఆట కొనసాగించిన భారత్ లంచ్ విరామానికి ఒక వికెట్ నష్టానికి 129/1 స్కోరుతో నిలిచింది. ఓపెనర్ రోహిత్ (44 బంతుల్లో 7 ఫోర్లతో 32) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. తొలి వికెట్ కు 74 పరుగులు జోడించిన తర్వాత స్పిన్నర్ కునెమన్ బౌలింగ్ లో లబుషేన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ (119 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 65 బ్యాటింగ్) ఆకట్టుకుంటున్నాడు. అద్భుతమైన డిఫెన్స్ కు తోడు నాణ్యమైన షాట్లతో బౌండరీలు రాబట్టాడు. అతనికి చతేశ్వర్ పుజారా (22 బ్యాటింగ్) మంచి సహకారం అందిస్తున్నాడు. ప్రస్తుతం రెండో వికెట్ కు గిల్, పుజారా అజేయంగా 55 పరుగులు జోడించారు. మొత్తంగా మూడో రోజు తొలి సెషన్ లో భారత్ ఒక వికెట్ కోల్పోయి 93 పరుగులు రాబట్టింది.

Team India
Australia
4th tst
gill
  • Loading...

More Telugu News