KCR: కవితకు ఈడీ నోటీసులపై సీఎం కేసీఆర్ స్పందన

CM KCR reacts to ED notice to Kavitha

  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో రేపు ఈడీ ఎదుట విచారణకు కవిత
  • కేంద్రంలో దుర్మార్గపు ప్రభుత్వం ఉందన్న కేసీఆర్
  • దర్యాప్తు సంస్థలతో వేధించే విధానం ఎంచుకుందని విమర్శలు
  • రాజకీయ పోరాటం మాత్రం ఆపబోమని స్పష్టీకరణ

తన కుమార్తె కవితకు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులు పంపడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. కేంద్రంలో దుర్మార్గపు ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. దర్యాప్తు సంస్థలతో వేధించే విధానం ఎంచుకుందని మండిపడ్డారు. మంత్రులతో మొదలుపెట్టి, ఇప్పుడు కవిత వరకు వచ్చారని వ్యాఖ్యానించారు. 

ఏం చేస్తారో చేసుకోనివ్వండి... కేంద్ర ప్రభుత్వంపై రాజకీయ పోరాటం మాత్రం ఆపేది లేదు అని హెచ్చరించారు. బీజేపీని గద్దె దింపే వరకు విశ్రమించొద్దు అని పార్టీ శ్రేణులకు కర్తవ్య బోధ చేశారు. సీఎం కేసీఆర్ ఇవాళ పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగానే పై వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News