Veyi Shubhamulu Kalugu Neeku: 'ఆహా'లో ఆకట్టుకుంటున్న విజయ్ రాజా 'వేయి శుభములు కలుగు నీకు'

Veyi Shubhamulu Kalugu Neeku movie streaming on Aha OTT

  • టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శివాజీరాజా తనయుడు
  • ఓటీటీలోకి వచ్చిన 'వేయి శుభములు కలుగు నీకు' చిత్రం
  • లక్షల సంఖ్యలో వ్యూస్ తో 'ఆహా'లో స్ట్రీమింగ్

టాలీవుడ్ ప్రముఖ నటుడిగా శివాజీరాజాకు ఉన్న గుర్తింపు అందరికీ తెలిసిందే. ఆయన తనయుడు విజయ్ రాజా 'వేయి శుభములు కలుగు నీకు' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. థియేటర్లలో అందరినీ ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు భవానీ మీడియా సంస్థ ద్వారా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా'లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతూ అందరినీ అలరిస్తోంది.

లవ్, కామెడీ, హారర్ ఎంటర్టయినర్‌గా వచ్చిన 'వేయి శుభములు కలుగు నీకు'  చిత్రంలో విజయ్ రాజా నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ సినిమాకు థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటోంది. మిలియన్ల వ్యూస్‌తో ఈ సినిమా ఓటీటీ ఆడియెన్స్‌ను మెప్పిస్తోంది.

జామి లక్ష్మీప్రసన్న సమర్పణలో జయ దుర్గాదేవి మల్టీ మీడియా పతాకంపై రామ్స్ రాథోడ్ దర్శకత్వంలో తూము నరసింహ పటేల్ మరియు జామి శ్రీనివాసరావులు సంయుక్తంగా కలసి ఈ సినిమాను నిర్మించారు.

ఇందులో విజయ్ రాజాకు జోడిగా తమన్నా వ్యాస్ నటించారు. మాస్టర్ జయదేవ్‌, శివాజీ రాజా, ఢీ ఫేం ఫాల్గుణి,  సత్యం రాజేశ్, జ్ఞాన ప్రియ, వెంకట్ నారాయణ, అపూర్వ, మీనా, అనంత్, సయ్యాజీ షిండే,  శ్రీకాంత్ అయ్యంగార్, రోహిణి, జబర్దస్త్  అప్పారావు, జబర్దస్త్ మురళి, రేసింగ్ రాజు, కోట యశ్వంత్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాకు గ్యాని సంగీతం అందించాడు. 

Veyi Shubhamulu Kalugu Neeku
Movie
Aha
OTT
Vijay Raja
Tollywood
  • Loading...

More Telugu News