Campa: శీతల పానీయాల వ్యాపారంలోకి రిలయన్స్

Reliance enters cool drinks business with Campa brand

  • గతంలో సందడి చేసిన కాంపా డ్రింకులు
  • కాంపా బ్రాండ్ ను కొనుగోలు చేసిన రిలయన్స్
  • తాజాగా మార్కెట్లోకి విడుదల
  • తొలుత ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అమ్మకాలు

దిగ్గజ వ్యాపార సంస్థ రిలయన్స్ కొత్త బిజినెస్ చేపడుతోంది. శీతల పానీయాల వ్యాపారంలోకి రిలయన్స్ అడుగుపెట్టింది. కొన్ని దశాబ్దాల కిందట దేశంలో సందడి చేసిన కాంపా డ్రింక్ ను రిలయన్స్ మళ్లీ విడుదల చేసింది. కాంపా బ్రాండ్ ను రిలయన్స్ సంస్థ ప్యూర్ డ్రింక్ గ్రూప్ నుంచి కొనుగోలు చేసింది. గతేడాది జరిగిన ఒప్పందంలో రిలయన్స్ రూ.22 కోట్లను ప్యూర్ డ్రింక్ గ్రూప్ కు చెల్లించింది. 

భారత శీతలపానీయాల విపణిలో కాంపా రంగప్రవేశం చేసింది. అప్పట్లో కాంపా కోలా, కాంపా ఆరెంజ్, కాంపా లెమన్ డ్రింకులు మార్కెట్ లో కనిపించేవి. తర్వాత కాలంలో థమ్సప్, లిమ్కా, గోల్డ్ స్పాట్ వంటి శీతలపానీయాల రాకతో కాంపా డ్రింకులు తెరమరుగయ్యాయి. 

కాగా, రిలయన్స్ సంస్థ తాజాగా కాంపాను కొత్త డిజైన్ బాటిళ్లు, ప్యాక్ లలో తీసుకువస్తోంది. 200 ఎంఎల్ నుంచి 2 లీటర్ ప్యాక్ ల వరకు అందుబాటులోకి తీసుకువస్తోంది. 200 ఎంఎల్ ధర రూ.10 మాత్రమే. మొదటగా తెలుగు రాష్ట్రాల్లో వీటి విక్రయాలు ప్రారంభిస్తున్నట్టు రిలయన్స్ వెల్లడించింది.

Campa
Reliance
Cool Drink
India
  • Loading...

More Telugu News