Nagashourya: 'ఫలానా అబ్బాయి .. ఫలానా అమ్మాయి' నుంచి బ్యూటిఫుల్ మెలోడీ!

Phalana Abbayi Phalana Ammayi Lyrical Song Released

  • అవసరాల నుంచి మరో ప్రేమకథా చిత్రం
  • నాగశౌర్య సరసన సందడి చేయనున్న మాళవిక నాయర్
  • తాజాగా వదిలిన మెలొడీకి మంచి మార్కులు  
  • ఈ నెల 17వ తేదీన సినిమా విడుదల

నాగశౌర్యకి లవర్ బాయ్ గా మంచి క్రేజ్ ఉంది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి మద్దతు ఉంది. ఆయన చేసిన 'ఫలానా అబ్బాయి - ఫలానా అమ్మాయి' సినిమా ఆ కోవకి చెందినదే. విశ్వప్రసాద్ - దాసరి పద్మజ నిర్మించిన ఈ సినిమాకి, అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు.

ఈ సినిమాలో నాగశౌర్య జోడీగా మాళవిక నాయర్ అలరించనుంది. ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. 'నీతో ఈ గడిచిన కాలం .. నడిచిన దూరం ఎంతో ఇష్టం' అంటూ ఈ మెలోడీ గీతం సాగుతోంది. 

హీరో ... హీరోయిన్లపై ఈ పాటను అందమైన .. ఆహ్లాదకరమైన లొకేషన్స్ లో చిత్రీకరించారు. కల్యాణి మాలిక్ తాను స్వరపరిచిన ఈ పాటను గీతామాధురితో కలిసి ఆలపించారు. భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించాడు. చాలా కాలం తరువాత వినిపించిన ఒక మంచి మెలోడీగా ఈ పాటను గురించి చెప్పుకోవచ్చు.

More Telugu News