Nara Lokesh: నేతన్న నేస్తం కూడా పెద్ద మోసం: నారా లోకేశ్

Lokesh talks to hand weavers

  • మదనపల్లి నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
  • ఎనుమువారిపల్లిలో చేనేత కార్మికులతో సమావేశం
  • వైసీపీ పాలనలో నేతన్నలను పట్టించుకోవడంలేదని విమర్శలు
  • టీడీపీ వచ్చాక ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేస్తామని హామీ 

టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర మదనపల్లి నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఎనుమువారిపల్లిలో చేనేత కార్మికులను కలిశారు. వైసీపీ పాలనలో నేతన్నలకు గుర్తింపు కార్డులు లేవని లోకేశ్ అన్నారు. 

నేతన్న నేస్తం కూడా పెద్ద మోసం అని విమర్శించారు. సొంత మగ్గాలు ఉన్నవారికే నేతన్న నేస్తం అంటున్నారని ఆరోపించారు. ఆప్కోలో దళారీ వ్యవస్థ పెరిగిపోయిందని అన్నారు. నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఆత్మహత్యలు చేసుకున్న నేతన్నల కుటుంబాలను ఆదుకోవడంలేదని తెలిపారు. 

ఇక, పవర్ లూమ్ వస్త్రాలకు, చేనేత వస్త్రాలకు తేడా తెలిసేలా లేబులింగ్ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. టీడీపీ అధికారంలోకి రాగానే చేనేత వస్త్రాలకు ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేస్తామని లోకేశ్ తెలిపారు.

Nara Lokesh
Hand Weavers
Netanna Nestam
Yuva Galam Padayatra
TDP
  • Loading...

More Telugu News