Krishna Vamsi: కృష్ణవంశీగారిని చూడగానే ఇదే మాట అనుకున్నాను: నటి ప్రగతి

Pragathi Interview

  • హీరోయిన్ గా ఇండస్ట్రీకి వచ్చిన ప్రగతి  
  • అమ్మ పాత్రలలో పాప్యులర్ 
  • కృష్ణవంశీ గురించిన ప్రస్తావన 
  • ఆయన ప్రత్యేకతను వెల్లడించిన ప్రగతి

తెలుగు తెరపై అందమైన అమ్మగా .. మంచి మార్కులు కొట్టేసిన నటిగా ప్రగతి కనిపిస్తారు. కెరియర్ తొలినాళ్లలో కథానాయికగా నటించిన ప్రగతి, ఆ తరువాత టీవీ సీరియల్స్ వైపు వెళ్లారు. కొంత గ్యాప్ తరువాత మళ్లీ అక్కా .. వదిన .. అమ్మ పాత్రలలో బిజీ అయ్యారు. తాజాగా 'ఐ డ్రీమ్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన గురించిన అనేక విషయాలను ప్రస్తావించారు.

'అంతఃపురం ' .. 'మురారి' సినిమాలు చూసిన తరువాత, కృష్ణవంశీగారి సినిమాలో చేయాలనిపించింది. కానీ ఆయన సినిమాలో అవకాశం రావడమే చాలా కష్టమైన విషయం అనుకున్నాను. అలాంటి నాకు 'గోవిందుడు అందరివాడేలే' సినిమాలో చేసే ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా సమయంలో ఆయనను చూశాను" అన్నారు. 

"కృష్ణవంశీ గారి సింప్లిసిటీ చూసి నేను ఆశ్చర్యపోయాను. అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది అనే సామెత గుర్తొచ్చింది. ఒక ఫ్యామిలీ నెట్ వర్క్ ను తెరపై అద్భుతంగా చూపించడం ఆయన ప్రత్యేకత. అందువల్లనే ఆయన సినిమాల్లోని చిన్న చిన్న పాత్రలు కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి" అని చెప్పుకొచ్చారు.

Krishna Vamsi
Pragathi
Tollywood
  • Loading...

More Telugu News