Dil Raju: దిల్ రాజు బ్యానర్లోనే మరో సినిమా చేయనున్న 'బలగం' వేణు!

Venu Next Movie Update

  • దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన 'బలగం' 
  • దర్శకుడిగా వేణుకి ఫస్టు సినిమా ఇది 
  • మరో ఛాన్స్ ఇచ్చిన దిల్ రాజు 
  • ఈ సారి ఓ మాదిరి బడ్జెట్ లోనే సినిమా 
  • త్వరలోనే వెలువడనున్న ప్రకటన

దిల్ రాజుకి నిర్మాతగా ఉన్న అనుభవం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. సొంత బ్యానర్లో 50 సినిమాలను నిర్మించినవారాయన. కథ విషయంలో దిల్ రాజును ఒప్పించడం అంటే అంత తేలికైన విషయమేం కాదు. అలాంటిది దిల్  రాజు బ్యానర్లో   కమెడియన్ వేణు  'బలగం' సినిమాను తెరకెక్కించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. 

అంతగా 'బలగం' సినిమాలో ఏముందా అని వెళ్లినవారికి, దిల్ రాజు ఎందుకు ఒప్పుకున్నాడనే విషయం అర్థమవుతుంది. తెలంగాణ నేపథ్యంలోని గ్రామీణ సంస్కృతిని ఆవిష్కరిస్తూ, కామెడీని .. ఎమోషన్ ను కలిపి నడిపించిన తీరుకు ఎక్కువ మార్కులు పడ్డాయి. పాటల పరంగా కూడా ఈ సినిమా సందడి చేసింది. 

వేణు పనితీరు నచ్చడం వలన ఆయనకి దిల్ రాజు మరో ఛాన్స్ ఇచ్చారనే టాక్ రెండు రోజులుగా వినిపిస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో ప్రాజెక్టు ఓకే అయిందనేది తాజా సమాచారం. ఓ మాదిరి బడ్జెట్ లోనే ఈ సినిమా రూపొందనుందని అంటున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ పై నిర్మితమయ్యే ఈ సినిమా పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.  

Dil Raju
Venu
Balagam Movie
  • Loading...

More Telugu News