Tammareddy Bharadwaja: 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్ ఖర్చుతో 8 సినిమాలు తీసి ముఖాన కొడతాం: తమ్మారెడ్డి

Tammareddy comments on RRR

  • ఆర్ఆర్ఆర్ సినిమాకు రూ.600 కోట్లు ఖర్చు చేశారన్న తమ్మారెడ్డి
  • మంచి సినిమానే తీశారని కితాబు
  • ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కు రూ.80 కోట్లు ఖర్చు పెట్టారని వెల్లడి
  • సమాజం కోసం కూడా సినిమాలు తీయాలని హితవు

టాలీవుడ్ ప్రముఖుడు తమ్మారెడ్డి భరద్వాజ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఆర్ఆర్ఆర్ చిత్రానికి రూ.600 కోట్లు ఖర్చు చేశారని, మంచి సినిమానే తీశారని పేర్కొన్నారు. అయితే, ఆస్కార్ ముంగిట ప్రమోషన్ల కోసం రూ.80 కోట్లు ఖర్చు చేశారని, ఆ రూ.80 కోట్లు తమ లాంటి వాళ్లకు ఇస్తే 8 సినిమాలు తీసి ముఖాన కొడతామని తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యానించారు. 

ఇప్పటి రోజుల్లో వస్తున్న సినిమాలు సమాజం కోసం తీస్తున్న సినిమాలు కాదని, మన సంతృప్తి కోసమే మనం సినిమాలు తీసుకుంటున్నామని విమర్శించారు. అప్పుడప్పుడు సమాజానికి ఉపయోగపడే సినిమాలు కూడా తీయాలని, సమాజానికి ఏదైనా సందేశం ఇవ్వగల అవకాశం ఫిలింమేకర్స్ కు ఉంటుందని అన్నారు.

Tammareddy Bharadwaja
RRR
Promotions
Budget
Tollywood
  • Loading...

More Telugu News