Kriti Sanan: 'ప్రభాస్ తో లవ్ ఎఫైర్' అంటూ వరుణ్ ధావన్ చేసిన పరోక్ష వ్యాఖ్యలపై కృతి సనన్ స్పందన

Kriti Sanan opines on Varun Dhavan

  • కృతిని ఓ వ్యక్తి హృదయంలో పెట్టుకున్నాడన్న వరుణ్
  • ఆ వ్యాఖ్యలతో దిగ్భ్రాంతికి గురయ్యానన్న కృతి సనన్
  • ప్రభాస్ తనకు స్నేహితుడు మాత్రమేనని స్పష్టీకరణ

ఓ రియాలిటీ షో వేదికపై బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ చేసిన వ్యాఖ్యలు తనను ఎంతగానో బాధించాయని హీరోయిన్ కృతి సనన్ తెలిపింది. ప్రభాస్ తో కృతి సనన్ ప్రేమలో ఉందంటూ వరుణ్ ధావన్ పరోక్ష వ్యాఖ్యలు చేశాడని, ఆ వ్యాఖ్యలు వినగానే దిగ్భ్రాంతికి గురయ్యానని వెల్లడించింది. 

ఇదే విషయాన్ని ప్రభాస్ కు ఫోన్ చేసి వివరించానని, వరుణ్ ధావన్ అలా ఎందుకన్నాడు? అని ప్రభాస్ అడిగాడని కృతి సనన్ వివరించింది. వరుణ్ ధావన్ వెర్రితనంతో ఆ వ్యాఖ్యలు చేసి ఉంటాడని ప్రభాస్ తో చెప్పానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ప్రభాస్ తనకు స్నేహితుడు మాత్రమేనని ఆమె స్పష్టం చేసింది. 

ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ సరసన కృతి సనన్ హీరోయిన్ అన్న విషయం తెలిసిందే. అయితే, బేడియా చిత్రం ప్రమోషన్స్ సందర్భంగా వరుణ్ ధావన్ తో కలిసి కృతి సనన్ ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొంది. 

కృతి ఓ వ్యక్తి హృదయంలో చోటు సంపాదించుకుందని, ఆ వ్యక్తి ఇప్పుడు దీపిక పదుకుణేతో కలిసి చిత్రీకరణలో ఉన్నాడంటూ వరుణ్ ధావన్ పరోక్షంగా వ్యాఖ్యానించాడు.. ప్రభాస్, దీపిక జంటగా ప్రాజెక్ట్ కె చిత్రంలో నటిస్తుండడంతో, వరుణ్ ధావన్ ప్రస్తావించింది ప్రభాస్ గురించేనని అందరికీ అర్థమైంది.

Kriti Sanan
Varun Dhavan
Prabhas
Adipurush
  • Loading...

More Telugu News