Tollywood: రామబాణంలో భైరవిగా డింపుల్ హయతి

dimple hayathi as Bhairavi in Ramabanam

  • గోపీచంద్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న హయతి
  • శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా
  • మే 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం

గద్దలకొండ గణేష్‌ చిత్రంలో ప్రత్యేక పాటలో మెప్పించి, రవితేజ సరసన ఖిలాడీ చిత్రంతో హీరోయిన్ మారిన తెలుగమ్మాయి డింపుల్ హయతి. ఇప్పుడామె ‘రామబాణం’ చిత్రంలో గోపీచంద్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. గోపీచంద్ తో లక్ష్యం, లౌక్యం వంటి చిత్రాలు రూపొందించిన శ్రీవాస్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. హోలీ, మహిళా దినోత్సవం కానుకగా ఈ  సినిమాలో డింపుల్ హయాతి పాత్ర పేరు, ఫస్ట్ లుక్ గ్లింప్స్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో ట్రావెల్ బ్యాగ్ పట్టుకొని సింపుల్ గా నడిచొస్తున్న అమాయకమైన అమ్మాయిగా డింపుల్ కనిపించింది. 

ఈ చిత్రంలో ఆమె భైరవి అనే పాత్రను పోషిస్తోంది. ఇక ఈ చిత్రంలో గోపీచంద్‌ భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన మార్కు యాక్షన్ తో పాటు ఫ్యామిలీ డ్రామా ఉంటుందని తెలుస్తోంది. జగపతిబాబు, ఖుష్బు చిత్రంలో గోపీకి అన్నా, వదినలుగా కనిపించనున్నారు. నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, సమీర్, తరుణ్ అరోరా ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. మే 5న సినిమా విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. భూపతి రాజా కథ అందించిన సినిమాకు మిక్కీ జె మేయర్  సంగీతం అందిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Tollywood
hero gopichand
srivas
dimple hayathi
Ramabanam
look

More Telugu News