wines close: ఏపీలోని ఆ జిల్లాల్లో 3 రోజులపాటు వైన్స్ బంద్

Liquor shops to remain shut on from March 11 to 14 in North Coastal Andhra amid Graduate MLC elections

  • ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎక్సైజ్ శాఖ ఆదేశాలు
  • విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో మూతపడనున్న మద్యం దుకాణాలు
  • ఈ నెల 11 నుంచి 13 వ తేదీ వరకు క్లోజ్

ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మూడు రోజుల పాటు వైన్ షాపులు మూతపడనున్నాయి. ఈ నెల 11 సాయంత్రం 4 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలు మూసేయాలని విశాఖపట్నం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 13న కోస్తాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది.

దీంతో మూడు జిల్లాల్లోని మద్యం దుకాణలు మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కలెక్టర్ ఎ.మల్లికార్జున ఆదేశాల మేరకు ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, మద్యం డిపోలతో పాటు స్టార్ హోటళ్లు, టూరిజం బార్‌లు, నేవల్ క్యాంటీన్లలో మద్యం అమ్మకాలను నిషేధిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఓట్ల లెక్కింపు జరిగే 16వ తేదీన కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో మద్యం దుకాణాలను బంద్ చేయాలని ఉత్తర్వుల్లో తెలిపారు.

More Telugu News