Surya: విజయ్ .. ధనుశ్ బాటలోనే సూర్య!

Surya in Hanu Raghavapudi Movie

  • తెలుగు దర్శకులపై దృష్టిపెట్టిన తమిళ హీరోలు 
  • ఈ విషయంలో సక్సెస్ అయిన విజయ్ - ధనుశ్ 
  • పరశురామ్ ను లైన్లో పెట్టిన కార్తి 
  • అదే బాటలో అడుగు ముందుకు వేసిన సూర్య

కోలీవుడ్ స్టార్ హీరోలంతా తమ సినిమాలను తెలుగులోను విడుదలయ్యేలా చూసుకుంటున్నారు. ఇక్కడ కూడా మార్కెట్ ను పెంచుకుంటూ .. అభిమానులను సంపాదించుకుంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ట్రెండ్ మారింది. నేరుగా తెలుగు మేకర్స్ తో తెలుగు సినిమా చేసి, దానిని తమిళంలో రిలీజ్ చేసుకుంటున్నారు. 

అలా విజయ్ చేసిన 'వారసుడు' (వరిసు) .. ధనుశ్ 'సార్' (వాతి) సినిమాలు, రెండు భాషల్లోను ప్రేక్షకుల ఆదరణ పొందాయి. దాంతో ఇప్పుడు కోలీవుడ్ హీరోలంతా ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. పరాశురామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి కార్తి రెడీ అవుతున్నాడు. 

ఇక ఇప్పుడు హను రాఘవపూడితో సినిమా చేయడానికి సూర్య సిద్ధమవుతున్నాడని అంటున్నారు. 'సీతారామం' తరువాత నానీతో ఒక సినిమా చేయడానికి హను రాఘవపూడి ప్లాన్ చేసుకుంటూ ఉండగా, లైన్లోకి సూర్య వచ్చాడట. దాంతో ఆయనతో ప్రాజెక్టును పట్టాలెక్కించే పనిలో రాఘవపూడి ఉన్నాడని చెబుతున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. 

Surya
Hanu Raghavapudi
Karthi
  • Loading...

More Telugu News