Priyadaarshi: ఈ దర్శకుల నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను: 'బలగం' వేణు!

Balagam Venu Interview

  • ఇటీవలే థియేటర్లకు వచ్చిన 'బలగం'
  • దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయిన వేణు
  • సినిమా కోసం పడిన కష్టాల ప్రస్తావన 
  • తాను పనిచేసిన దర్శకులే తనకి స్ఫూర్తి అని వెల్లడి 

కమెడియన్ గా వేణుకి మంచి పేరు ఉంది. తాను టీమ్ లీడర్ గా ఉన్నప్పుడు 'జబర్దస్త్'కి చాలామంది కమెడియన్స్ ను ఆయన పరిచయం చేశాడు. ఇక తాజాగా ఆయన దర్శకత్వంలో వచ్చిన 'బలగం' సినిమా సక్సెస్ టాక్ ను తెచ్చుకుంది. తాజా ఇంటర్వ్యూలో వేణు మాట్లాడుతూ .. "ఈ సినిమా కోసం రెండున్నరేళ్లు కేటాయించవలసి వచ్చింది. అన్ని వైపుల నుంచి ఎమోషన్స్ పండేలా చూసుకున్నాము" అన్నాడు. 

"ఈ సినిమాను నేను ఇంత బాగా తీయడానికి కారణం, నేను పనిచేసిన దర్శకుల దగ్గర నుంచి సంపాదించుకున్న అనుభవమే .. నేర్చుకున్న విషయాలే. కొత్త ఆర్టిస్టుల దగ్గర నుంచి నటన ఎలా రాబట్టుకోవాలనేది తేజ గారిని చూసి నేర్చుకున్నాను. ఇక ఒక సీన్ ను ఆర్టిస్టులకు ఎలా వివరించాలనేది కృష్ణవంశీ గారిని చూసి తెలుసుకున్నాను" అని చెప్పాడు. 

"ఇక త్రివిక్రమ్ గారు రెండు పేజీలకు అవసరమయ్యే సీన్ ను ఒక్క డైలాగ్ లో చెప్పగలరు. 'అత్తారింటికి దారేది' సినిమాలో నేను ఒక చిన్న సీన్ చేశాను. అయినా ఆయన నాకు కథ మొత్తం చెప్పారు. అంత కథ చెబితేనేగానీ ఆ సీన్ విలువ తెలియదు. ఆయన నుంచి అది నేర్చుకున్నాను. అందువల్లనే ఈ సినిమాను ఇంత బాగా తీయగలిగాను" అని చెప్పుకొచ్చాడు.

Priyadaarshi
Kavya
Venu
Balagam Movie
  • Loading...

More Telugu News