Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం 9వ సినిమా రేపు లాంచ్ .. హీరోయిన్ ఎవరంటే ..!

- కిరణ్ అబ్బవరం 9వ సినిమాకి సన్నాహాలు
- రేపు రామానాయుడు స్టూడియోలో లాంచ్
- దర్శకుడిగా వ్యవహరించనున్న విశ్వ కరుణ్
- ఈ సినిమాతో కథానాయికగా నజియా పరిచయం
యంగ్ హీరోలకు గట్టి పోటీనిస్తూ కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే ఆయన నుంచి వచ్చిన 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమా సక్సెస్ ను సాధించింది. ఆ తరువాత సినిమాగా ఆయన నుంచి 'మీటర్' రానుంది. ఈ నెల 17వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది.

హైదరాబాద్ .. రామానాయుడు స్టూడియోలో ఉదయం 7: 45 నిమిషాలకు ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది. గతంలో కొన్ని సినిమాలకి రైటర్ గా పనిచేసిన విశ్వకరుణ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో కథనాయికగా నజియా పరిచయమవుతోంది. గతంలో 'మిస్టర్ మజ్ను' .. ' సోలో బ్రతుకే సో బెటర్' అనే సినిమాల్లో గ్లామరస్ గా మెరిసింది.
