Rahul Gandhi: 'కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్' అంటూ రాహుల్ గాంధీని పొగిడిన బీజేపీ నాగాలాండ్ రాష్ట్ర అధ్యక్షుడు

 Nagaland BJP chiefs praise for Rahul Gandhi

  • భారత్ జోడో యాత్ర తర్వాత తన లుక్ మార్చిన రాహుల్
  • ప్రస్తుతం బ్రిటన్ పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేత
  • లండన్ లో సూట్ వేసుకొని ఫొటో దిగిన రాహుల్ గాంధీ

భారత్ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన లుక్ పూర్తిగా మార్చేశారు. ప్రస్తుతం ఆయన బ్రిటన్ పర్యటనలో ఉన్నారు. అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బ్రిటన్ పార్లమెంట్ లో ప్రసంగించిన ఆయన నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ప్రతిగా బీజేపీ నేతలు సైతం రాహుల్ పై విమర్శలు సంధిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ నాగాలాండ్ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి టెంజెన్ ఇమ్నా అలోంగ్ రాహుల్ గాంధీని అభినందించారు. 

లండన్ లో రాహుల్ దిగిన ఫొటో బాగుందంటూ కితాబునిచ్చారు. రాహుల్ సూట్ వేసుకొని స్టయిల్ గా నిల్చున్న ఫొటోను కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ లో షేర్ చేసింది. కాంగ్రెస్ అభిమానులంతా కాబోయే పీఎం అంటూ ఆయనను కీర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఫొటో కింద ఆసక్తికర కామెంట్ చేశారు. ‘అంగీకరించాలి, ఫోటో బాగుంది. కాన్ఫిడెన్స్ తో పాటు పోజ్ కూడా నెక్స్ట్ లెవెల్’ అంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

More Telugu News