Nagashourya: నా నిర్ణయాలు నావే: మాళవిక నాయర్

Malavika Nair Interview

  • అవసరాల నుంచి మరో ప్రేమకథ
  • నాగశౌర్య జోడీగా నటించిన మాళవిక నాయర్
  • తన పాత్రకి మంచి గుర్తింపు వస్తుందన్న మాళవిక 
  • ఈ నెల 17న విడుదలవుతున్న సినిమా

మాళవిక నాయర్ గతంలో తమిళ .. మలయాళ సినిమాలు చేసినప్పటికీ, ఈ మధ్య కాలంలో ఆమె తెలుగు సినిమాలపైనే పూర్తి ఫోకస్ పెట్టారు. ఆమె తాజా చిత్రంగా రూపొందిన 'ఫలానా అబ్బాయి - ఫలానా అమ్మాయి' సినిమా, ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. 

తాజా ఇంటర్వ్యూలో మాళవిక మాట్లాడుతూ .. "నాగశౌర్యతో నాకు ఇది రెండవ సినిమా. ఇది లవ్ స్టోరీ అనే విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇందులోను రొమాన్స్ .. ఎమోషన్స్ ఉంటాయి. అవసరాల శ్రీనివాస్ గారి టేకింగ్ నాకు బాగా నచ్చింది. ఆయన ఈ కథను సహజత్వానికి చాలా దగ్గరగా తీసుకుని వెళ్లారు" అన్నారు. 

"ఏ సినిమాలో చేయవలసి వచ్చినా, ముందుగా నేను కథకే ప్రాధాన్యతను ఇస్తాను. నా సినిమాలకి సంబంధించిన నిర్ణయాలను నేనే తీసుకుంటాను. అలా ఈ కథను విన్న తరువాత నేను ఎస్ చెప్పాను. ఈ సినిమాలో నేను చేసిన పాత్ర తప్పకుండా మంచి పేరు తీసుకు వస్తుందని భావిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.

Nagashourya
Malavika Nair
Phalana Abbayi Phalana Ammayi
  • Loading...

More Telugu News