Srikanth Digala: అమెరికాలో రైలు ఢీకొని ఏపీ వ్యక్తి దుర్మరణం

AP Man dies in New Jersey

  • న్యూజెర్సీలో ఘటన
  • రైలు పట్టాలపై నడుస్తుంగా ఢీకొట్టిన రైలు
  • మృతి చెందిన దిగాల శ్రీకాంత్
  • శ్రీకాంత్ అన్నమయ్య జిల్లాకు చెందిన వ్యక్తి

అమెరికా తెలుగు సమాజంలో తీవ్ర విషాదం నెలకొంది. ఏపీకి చెందిన ఓ వ్యక్తి న్యూజెర్సీలో రైలు ఢీకొని దుర్మరణం పాలైన ఘటన ఆలస్యంగా వెల్లడైంది. మరణించిన వ్యక్తిని దిగాల శ్రీకాంత్ గా గుర్తించారు. 39 ఏళ్ల శ్రీకాంత్ అన్నమయ్య జిల్లాకు చెందినవాడు. కుటుంబంతో కలిసి న్యూజెర్సీలోని ప్లెయిన్స్ బరోలో నివసిస్తున్నాడు. 

ఫిబ్రవరి 28న పట్టాలపై నడుచుకుంటూ వెళుతుండగా, వాషింగ్టన్ నుంచి బోస్టన్ వెళుతున్న ఆమ్ ట్రాక్ రైలు ఢీకొట్టింది. ప్రిన్స్ టన్ జంక్షన్ వద్ద ఈ ఘటన జరిగింది. శ్రీకాంత్ కు భార్య, 10 ఏళ్ల వయసున్న కుమారుడు ఉన్నారు. అతడి కుటుంబాన్ని ఆదుకునేందుకు అమెరికాలోని మిత్రులు నిధుల సేకరణ కార్యక్రమం చేపట్టారు.

Srikanth Digala
Andhra Pradesh
Annamayya District
New Jersey
Amtrak Train
  • Loading...

More Telugu News