Kiran Abbavaram: ఇది పవర్ తో కాదు .. పొగరుతో నడిచే మాస్ 'మీటర్' .. టీజర్ రిలీజ్!

Meter teaser released

  • కిరణ్ అబ్బవరం నుంచి 'మీటర్' 
  • కథానాయికగా అతుల్య రవి పరిచయం 
  • సంగీతాన్ని అందించిన సాయికార్తీక్ 
  • ఏప్రిల్ 7వ తేదీన సినిమా రిలీజ్    

కిరణ్ అబ్బవరం హీరోగా ఇటీవల వచ్చిన 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమా హిట్ కొట్టింది. నటన పరంగా .. డాన్స్ పరంగా .. ఫైట్స్ పరంగా కిరణ్ మరింత పరిణతిని కనబరిచాడు. ఆ తరువాత సినిమాగా ఆయన 'మీటర్' సినిమాను చేశాడు. ఇప్పుడు ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. 

చిరంజీవి - హేమలత నిర్మించిన ఈ సినిమాకి, రమేశ్ దర్శకత్వం వహించాడు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. 'బ్లాస్ట్ కావడానికి ఇది పవర్ తో నడిచే మీటర్ కాదు .. పొగరుతో నడిచే మాస్ మీటర్' అంటూ హీరో చెప్పే డైలాగ్ చూస్తుంటే, యాక్షన్ పాళ్లు ఎక్కువగానే ఉన్నాయనే విషయం అర్థమవుతోంది. 

కథానాయికగా ఈ సినిమాతో 'అతుల్య రవి' పరిచయం కానుంది. కోయంబత్తూర్ కి చెందిన ఈ బ్యూటీ, 2017 నుంచే తన కెరియర్ ను మొదలుపెట్టింది. ఇతర ముఖ్యమైన పాత్రల్లో పోసాని .. సప్తగిరి తదితరులు కనిపించనున్నారు. సాయి కార్తీక్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, ఏప్రిల్ 7వ తేదీన విడుదల చేయనున్నారు.

Kiran Abbavaram
Athulya Ravi
Meter Movie

More Telugu News