osmania university: తెలంగాణ సెట్ పరీక్ష రీషెడ్యూల్

OU  reschedules TS SET 2023  exam on march 13th

  • ఈ నెల 13, 14, 15వ తేదీల్లో పరీక్షలు
  • ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రీషెడ్యూల్ 
  • 13న జరగాల్సిన పరీక్ష ఈనెల 17వ తేదీకి వాయిదా
  • ఈనెల 10 నుంచి వెబ్ సైట్ లో హాల్ టికెట్లు

తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్ సెట్) పరీక్షను ఉస్మానియా విశ్వవిద్యాలయం రీషెడ్యూల్ చేసింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం టీఎస్ సెట్ ఈనెల 13వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరగాల్సి ఉంది. అయితే, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో  13న జరగాల్సిన పరీక్షను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఆ రోజు జరిగే పరీక్షను ఈ నెల 17వ తేదీన నిర్వహిస్తున్నట్టు మంగళవారం తెలిపింది. ఈనెల 14, 15వ తేదీల్లో నిర్వహించే సెట్ పరీక్షా సమయాల్లో మార్పులు లేవని స్పష్టం చేసింది. సెట్ కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచించింది.

osmania university
ts set 2023
exam
reschedule
  • Loading...

More Telugu News