Rana Daggubati: ప్రభాస్ చెఫ్ ను ఎత్తుకుపోతా: రానా

Rana interesting comments about his fellow heroes

  • వెంకటేశ్ తో కలిసి 'రానా నాయుడు'లో నటించిన రానా
  • మార్చి 10 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
  • ప్రమోషన్ కార్యక్రమాలతో రానా బిజీ
  • యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం

విక్టరీ వెంకటేశ్, రానా కలిసి నటించిన 'రానా నాయుడు' ఈ నెల 10 నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీ వేదికపై స్ట్రీమింగ్ కానుంది. రానా నాయుడు ప్రమోషన్స్ సందర్భంగా రానా ఇతర హీరోల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరోల నుంచి ఏదైనా దొంగతనం చేయాల్సి వస్తే ఏం ఎత్తుకుపోతారు? అని యాంకర్ అడగ్గా... రానా బదులిచ్చారు. 

"ప్రభాస్ అంటే మాంచి ఫుడ్ కు మారుపేరు. అందుకే ప్రభాస్ చెఫ్ ను ఎత్తుకుపోతా. ఇక, ఎన్టీఆర్ నుంచి దొంగతనం చేయాల్సి వస్తే అతడి భాషా నైపుణ్యాన్ని చోరీ చేస్తా. ఎందుకంటే, తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళం, హిందీ, ఇంగ్లీషు, మరో ఐదు భారతీయ భాషలను ఎన్టీఆర్ మాట్లాడగలడు. ఒక్క ఇరవై నిమిషాల పాటు ఏదైనా భాషను విన్నాడంటే వెంటనే మాట్లాడేస్తాడు. ఎన్టీఆర్ కు కొంచెం టైమ్ ఇస్తే చైనా భాషను కూడా మాట్లాడగలడు. 

అల్లు అర్జున్ గురించి చెప్పాలంటే... అతడి నుంచి నేను ఏదీ దొంగతనం చేయను... మేమిద్దరం కలిసి ఇంకొకరి దగ్గర దొంగతనం చేస్తాం. రామ్ చరణ్ నుంచి ఏదీ దొంగతనం చేయను... అతడికి నేనే ఏదైనా ఇచ్చేస్తాను" అంటూ రానా సరదా వ్యాఖ్యలు చేశారు.

Rana Daggubati
Prabhas
Chef
NTR
Allu Arjun
Ram Charan
Rana Naidu
Venkatesh
Netflix
  • Loading...

More Telugu News