Rajanikanth: 'హోలీ' సందర్భంగా సెట్స్ పైకి వెళ్లిన రజనీ 'లాల్ సలామ్'

Lal Salaam shooting started

  • రజనీ తాజాగా చిత్రంగా రూపొందుతున్న 'లాల్ సలామ్'
  • కీలకమైన పాత్రలో కనిపించనున్న జీవిత రాజశేఖర్
  • ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనున్న ఏఆర్ రెహ్మాన్ 
  • పాన్ ఇండియా ప్రాజెక్టుగా పట్టాలెక్కించిన లైకా

రజనీకాంత్ కథానాయకుడిగా 'లాల్ సలామ్' సినిమా పట్టాలెక్కనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ ప్రాజెక్టు ఈ రోజున సెట్స్ పైకి వెళ్లింది. ఈ సినిమా షూటింగును ఈ రోజున మొదలుపెట్టారు. అందుకు సంబంధించిన విషయాన్ని తెలియజేస్తూ కొంతసేపటి క్రితం టైటిల్ పోస్టర్ ను వదిలారు. 

రజనీ క్రేజ్ కీ .. ఆయన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథ ఇది. లుక్ పరంగా కూడా కొత్త రజనీని ప్రేక్షకుల ముందుంచే సినిమా ఇది. రజనీకాంత్ క్రేజ్ కీ .. ఆయన మార్కెట్ కి తగినట్టుగా భారీ బడ్జెట్ తోనే ఈ సినిమాను లైకా వారు నిర్మిస్తున్నారు. ఐశ్వర్య రజనీకాంత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

రజనీ కాంత్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో, విష్ణు విశాల్ .. విక్రాంత్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. జీవిత రాజశేఖర్ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను చేస్తుండటం విశేషం. ఏఆర్ రెహ్మాన్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ అవుతుందని భావిస్తున్నారు. ఆల్రెడీ రజనీ చేస్తున్న 'జైలర్' తరువాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Rajanikanth
Vishnu Vishal
Vikranth
Lal Salaam Movie
  • Loading...

More Telugu News