Manish Sisodia: జైల్లోనే సిసోడియాను ప్రశ్నించనున్న ఈడీ అధికారులు

ED to question Manish Sisodia in Jail

  • తీహార్ జైల్లో రిమాండ్ లో ఉన్న సిసోడియా
  • ఈరోజు జైల్లోనే ప్రశ్నించనున్న ఈడీ అధికారులు
  • అరెస్ట్ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా

లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనిశ్ సిసోడియా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన ఐదు రోజుల సీబీఐ కస్టడీలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఈ క్రమంలో ఈరోజు ఆయనను జైల్లోనే ఈడీ అధికారులు విచారించనున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీ లాండరింగ్ అభియోగాలపై సిసోడియాను ప్రశ్నించనున్నారు. 

మరోవైపు రాజకీయ కక్షల్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఇదంతా చేయిస్తోందని ఆప్ నేతలు విమర్శిస్తున్నారు. ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. సీబీఐ అరెస్ట్ చేసిన రెండు రోజుల తర్వాత ఆయన డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. మరోవైపు ఇదే కేసులో హైదరాబాద్ కు చెందిన లిక్కర్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లైని నిన్న కొన్ని గంటల సేపు ఈడీ విచారించింది. అనంతనం నిన్న సాయంత్రం అరెస్ట్ చేసింది.

  • Loading...

More Telugu News