Aryan Goura: ప్రేమకథా చిత్రంగా 'ఓ సాథియా' .. అప్ డేట్!

O Saathiya Movie Updte

  • తెలుగు తెరపైకి మరో ప్రేమకథ 
  • హీరోగా ఆర్యన్ గౌర 
  • ముగింపు దశకి చేరుకున్న షూటింగ్ 
  • ఆసక్తిని పెంచుతున్న అప్ డేట్స్

ఏ సినిమా తీసుకున్నా అందులో ప్రేమకథ ఉంటుంది. అలాంటి ప్రేమకథనే ఇతివృత్తంగా తీసుకుని చేసే సినిమాలకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ప్రేమకథా చిత్రాలకు యూత్‌ ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తుంటుంది. అందుకే మేకర్లు లవ్ స్టోరీలను తెరకెక్కించేందుకు మక్కువ చూపుతుంటారు. ఈ కోవలోకే ఇప్పుడు 'ఓ సాథియా' అనే సినిమా కూడా రాబోతోంది. 

తన్విక - జశ్విక క్రియేషన్స్ బ్యానర్ మీద చందన కట్టా 'ఓ సాథియా' అనే చిత్రాన్ని నిర్మిస్తుండగా.. దివ్య భావన దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్యన్ గౌర హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆయన జోడీగా మిస్తీ చక్రవర్తి నటించారు. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగింపు దశలోకి వచ్చాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

ఓ సాథియా నుంచి విడుదల చేసిన టైటిల్ సాంగ్, వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పాటలకు మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ వచ్చిన అప్ డేట్లతో సినిమా మీద మంచి బజ్ ఏర్పడింది. వేణు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అవుతుందని తెలుస్తోంది. విన్ను సంగీత సారథ్యంలో వచ్చిన పాటలు ఇప్పటికే శ్రోతలను ఆకట్టుకున్నాయి. అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించనున్నారు. 

Aryan Goura
Misthi Chakravarthy
O Saathiya Movie
  • Loading...

More Telugu News