Naveen: బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసులో మరో ఇద్దరి అరెస్ట్

Two more arrests in Naveen murder case

  • ఇటీవల నవీన్ ను దారుణంగా హత్య చేసిన హరిహరకృష్ణ
  • తన గాళ్ ఫ్రెండ్ కు దగ్గరవుతున్నాడని కక్షతో దారుణం
  • ఇప్పటికే హరిహరకృష్ణ అరెస్ట్
  • తాజాగా హరిహరకృష్ణ ప్రియురాలు, స్నేహితుడు అరెస్ట్
  • హత్య విషయం తెలిసి కూడా దాచారని అభియోగం

తన గాళ్ ఫ్రెండ్ కు దగ్గరవుతున్నాడని కక్షగట్టి స్నేహితుడ్ని దారుణంగా అంతమొందించిన ఘటన ఇటీవల సంచలనం సృష్టించింది. నవీన్, హరిహరకృష్ణ బీటెక్ విద్యార్థులు కాగా... ఓ అమ్మాయి కారణంగా హరిహరకృష్ణ... నవీన్ ను కిరాతకంగా హత్య చేశాడు. నవీన్ ను హత్య చేశాక గుండె చీల్చి, పేగులు బయటికి లాగి, మర్మాంగం కోసేసి... హరిహరకృష్ణ అత్యంత పైశాచికంగా వ్యవహరించాడు. 

కాగా, ఈ కేసులో పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ హత్య విషయం తెలిసి కూడా దాచారన్న కారణంతో హరిహరకృష్ణ ప్రియురాలు నీహారిక, స్నేహితుడు హసన్ లను కూడా పోలీసులు ఈ కేసులో నిందితులుగా చేర్చారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. 

ఇప్పటికే ప్రధాన నిందితుడు హరిహరకృష్ణను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల హరిహరకృష్ణను పలుమార్లు హత్య జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లి మర్డర్ సీన్ రీకన్ స్ట్రక్షన్ ప్రక్రియ చేపట్టారు.

Naveen
Murder
Hariharakrishna
Hasan
Niharika
  • Loading...

More Telugu News