Vishwak Sen: 'దాస్ కా ధమ్కీ' నుంచి మాస్ బీట్ తో నడిచే సాంగ్!

Das Ka Dhamki  Lyrical Song Released

  • విష్వక్సేన్ హీరోగా రూపొందిన 'దాస్ కా ధమ్కీ'
  • ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మితమైన సినిమా 
  • సంగీతాన్ని సమకూర్చిన లియోన్ జేమ్స్ 
  • కథానాయికగా ఆకట్టుకోనున్న నివేదా పేతురాజ్

విష్వక్సేన్ ఒక వైపున బయట బ్యానర్లో సినిమాలు చేస్తూనే, మరో వైపున తన సొంత బ్యానర్లో .. తన దర్శకత్వంలోను సినిమాలు చేస్తున్నాడు. అలా స్వీయ దర్శకత్వంలో ఆయన చేసిన సినిమానే 'దాస్ కా ధమ్కీ'. హీరోగా 'ఓరి దేవుడా' తరువాత ఆయన చేసిన సినిమా ఇది.

తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగును రిలీజ్ చేశారు. 'ఓ డాలర్ పిలగా .. జిల్ జిలగా .. నీ జంగలు జింకనురా' అంటూ ఈ పాట సాగుతోంది. లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించిన ఈ పాటకి పూర్ణాచారి సాహిత్యాన్ని అందించగా, మంగ్లీ - దీపక్ బ్లూ ఆలపించారు.

ఈ సినిమాలో ఇది ఐటమ్ సాంగ్. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే బీట్ తోనే ఈ పాట నడుస్తుంది. విష్వక్సేన్ జోడీగా నివేదా పేతురాజ్ నటించిన ఈ సినిమాలో, రావు రమేశ్ .. పృథ్వీ .. అజయ్ .. రోహిణి ..  అక్షర గౌడ .. ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.

Vishwak Sen
Nivetha Pethuraj
Das Ka Dhamki Movie

More Telugu News