Ajay Devgan: ఆసక్తిని రేపుతున్న 'భోలా' .. ట్రైలర్ రిలీజ్!

Bholaa Trailer Released

  • అజయ్ దేవగణ్ దర్శకత్వంలో రూపొందిన 'భోలా'
  • కార్తి 'ఖైది' సినిమాకి ఇది రీమేక్ 
  • ముఖ్య పాత్రలలో టబు - అమలా పాల్ 
  • ఈ నెల 30వ తేదీన సినిమా రిలీజ్ 

బాలీవుడ్ యాక్షన్ హీరోలలో అజయ్ దేవగణ్ ఒకరు. తన సినిమాల్లో ఆయన యాక్షన్ కీ .. ఎమోషన్ కి ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఆయన విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అలా ఆయన నుంచి రావడానికి మరో సినిమా రెడీ అవుతోంది .. ఆ సినిమా పేరే 'భోలా'.

భూషణ్ కుమార్ - కృష్ణకుమార్ నిర్మించిన ఈ సినిమాకి, అజయ్ దేవగణ్ కూడా ఒక నిర్మాతగా ఉన్నారు. ఈ నెల 30వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. యాక్షన్ సన్నివేశాలపైనే ఈ ట్రైలర్ ను కట్ చేశారు. 

ఆ మధ్య తమిళంలో కార్తి చేసిన 'ఖైది' సినిమాకి ఇది రీమేక్. తెలుగులో కూడా ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ఉత్తరాదివారి అభిరుచికి తగినట్టుగా ఈ కథకి అదనపు హంగులు చేర్చారు. అజయ్ దేవగణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టబూ .. అమలా పాల్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.

More Telugu News