kendriya vidyalaya: ఉప్పల్ కేంద్రీయ విద్యాలయలో ఉద్యోగాల నోటిఫికేషన్

Kendriya Vidyalaya Uppal Recruitment 2023 Notification
  • పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
  • రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూతోనే ఎంపిక
  • ఖాళీలు, కావాల్సిన అర్హతల వివరాలు
హైదరాబాద్ ఉప్పల్ లోని కేంద్రీయ విద్యాలయం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. విద్యాలయంలో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. బీఈడీ, డిగ్రీ, డిప్లొమా, బీఈ, బీఎస్సీ, డీఈడీ, ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు సీటెట్ అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు ప్రకటించింది.

భర్తీ చేయనున్న పోస్టులు ఇవే..
పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ, కోచ్, స్టాఫ్ నర్స్, ఎడ్యుకేషనల్ కౌన్సెలర్, స్పెషల్ ఎడ్యుకేటర్ & కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్

విభాగాలు..
కెమిస్ట్రీ, మ్యాథ్స్, హిందీ, కామర్స్, సోషల్ స్డడీస్, ఇంగ్లిష్, సైన్స్, సంస్కృతం, మ్యూజిక్, డ్యాన్స్, హాకీ/అథ్లెటిక్స్, యోగా, టైక్వాండో.

కావాల్సిన అర్హతలు..
ఆయా పోస్టును బట్టి బీఈడీ, డిగ్రీ, డిప్లొమా, బీఈ, డీఈడీ, ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు సీటెట్ అర్హత సాధించాలి.

వయోపరిమితి..
అభ్యర్థుల వయసు 18-65 ఏళ్ల మధ్యలో ఉండాలి

దరఖాస్తు చేసుకోవడం ఎలా..
ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఎంపిక విధానం..
ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

జీతభత్యాలు.. 
నెలకు రూ.21250-రూ.27500 చెల్లిస్తారు.

ఇంటర్వ్యూ జరిగే స్థలం..
కేంద్రీయ విద్యాలయం, నెం.1, ఉప్పల్, హైదరాబాద్

ముఖ్యమైన తేదీలు..
ఇంటర్వ్యూ: 07.03.2023 & 10.03.2023.
ఇంటర్వ్యూ టైం: ఉదయం 8:30.
kendriya vidyalaya
uppal
Hyderabad
Telangana
job notification
jobs

More Telugu News