: రష్యాలో ఉల్కాపాతం.. 400 మందికి గాయాలు


సాధారణంగా ఉల్కాపాతం వల్ల భూమిపై ప్రజలకు ఎటువంటి అపాయం కలగదు. కానీ, ఆకాశం నుంచి ఊడిపడిన ఓ ఉల్క కారణంగా రష్యాలో 400 మంది గాయపడ్డారు. ఈ ఉదయం అక్కడి చెలియాబింక్ ప్రాంతంలో ఉల్కాపాతం వల్ల ఇంటి అద్దాలు పగిలి చాలా మందికి గాయాలయ్యాయి. 102 మందిని అత్యవసరంగా ఆస్పత్రులలో చేర్చినట్లు రష్యా హోంశాఖ ప్రతినిధి వాదిమ్ తెలిపారు. ఉల్క రాలి పడడం వల్ల స్థానికంగా ఉన్న ఒక ఫ్యాక్టరీ పైకప్పు కూలిపో్యిందని చెప్పారు. 

  • Loading...

More Telugu News