Ramabanam: గోపీచంద్ 'రామబాణం' రిలీజ్ డేట్ ఫిక్స్

Ramabanam hitting Theatres on May 5th

  • వేసవి కానుకగా మే5న విడుదల
  • హీరోయిన్ గా నటిస్తున్న డింపుల్ హయతి
  • పరీక్షలు బాగా రాయాలని చెబుతూ కొత్త పోస్టర్ రిలీజ్

హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన లక్ష్యం, లౌక్యం చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. వీటితో గోపీచంద్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. దాంతో వీరిది సక్సెస్ ఫుల్ కాంబినేషన్ గా మారింది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తోన్న మూడో చిత్రం ‘రామబాణం’. డింపుల్ హయతి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ ఈ సినిమాకు టైటిల్ ఖరారు చేశారు. శివరాత్రి కానుకగా గోపీచంద్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా.. మంచి స్పందన వచ్చింది. తాజాగా  సినిమా విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. 

విద్యార్థులందరికీ పరీక్షలు ముగిశాక వేసవిలో మిమ్మల్ని అలరించటానికి, అసలు సిసలు వినోదాన్ని పంచడానికి మే 5న ‘రామబాణం’ దూసుకొస్తోంది అని తెలిపింది. అలాగే  పరీక్షల సమయం కావడంతో బాగా చదవండి.. పరీక్షలు బాగా రాయండి వేసవి సెలవుల్లో కలుద్దాం అంటూ  కొత్త పోస్టర్‌‌ను కూడా విడుదల చేసింది. ఇందులో గోపీచంద్ చేతిలో ఆయుధం పట్టుకుని కోపంగా చూస్తున్నారు. జగపతి బాబు, ఖుష్బూ, సచిన్ ఖేడ్కర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. కాగా, గోపీచంద్‌ కెరీర్‌‌లో ఇది 30వ చిత్రం. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

Ramabanam
gopichand
new movie
release
5th may

More Telugu News