WPL: ముంబయిలో అట్టహాసంగా డబ్ల్యూపీఎల్ ప్రారంభోత్సవం

WPL starts in a grand way

  • డీవై పాటిల్ స్టేడియంలో ఓపెనింగ్ సెర్మనీ
  • తమ డ్యాన్స్ తో ఉర్రూతలూగించిన కియారా, కృతి సనన్
  • అలరించిన పంజాబీ పాప్ సింగర్ ఏపీ థిల్లాన్
  • తొలి మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్

మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) పోటీలు ముంబయిలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఓపెనింగ్ సెర్మనీలో బాలీవుడ్ తారలు కియారా అద్వానీ, కృతి సనన్ తమ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. బిజిలీ, పరమ సుందరి వంటి హిట్ సాంగ్స్ కు డ్యాన్స్ చేసి క్రికెట్ లవర్స్ ను ఉర్రూతలూగించారు. 

ఆ తర్వాత పంజాబీ పాప్ స్టార్ ఏపీ థిల్లాన్ కూడా తన పాటలతో అలరించారు. తన హిట్ సాంగ్ 'బ్రౌన్ ముండే'ను ఆలపించి మైదానంలో సంగీత తరంగాలను వ్యాపింపజేశాడు. ఇక, బీసీసీఐ పెద్దలు రోజర్ బిన్నీ, జై షాల సమక్షంలో డబ్ల్యూపీఎల్ జట్ల కెప్టెన్లందరూ కలిసి ట్రోఫీని ఆవిష్కరించారు. ప్రముఖ వ్యాఖ్యాత మందిరా బేడీ ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించారు. 

కాగా, టోర్నీ ఆరంభ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. ముంబయి ఇండియన్స్ కు హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వం వహిస్తుండగా, గుజరాత్ జెయింట్స్ కు బెత్ మూనీ సారథ్యం చేపడుతోంది.

WPL
Opening Ceremony
Mumbai
Mumbai Indians
Gujarat Giants
  • Loading...

More Telugu News