Nani: నాని ‘దసరా’ నుంచి తాజా అప్​ డేట్

Dasara 3rd single out on 8th March

  • ఈ నెల 8న మూడో పాట విడుదల
  • హీరోయిన్ గా నటించిన కీర్తి సురేశ్
  • ఈ నెల 30న ఐదు భాషల్లో విడుదలవుతున్న చిత్రం

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘దసరా’ పై టాలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి. నాని తొలిసారి పూర్తి స్థాయి మాస్ పాత్రలో కనిపిస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో  కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో  ఈనెల 30న విడుదల కానుంది. దాంతో, చిత్ర బృందం ఇప్పుడు ప్రమోషన్లలో నిమగ్నమైంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, ట్రైలర్, నాని మాస్ లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. 

రెండు పాటలకు కూడా మంచి స్పందన వచ్చింది.  ఈ క్రమంలో సినిమాలోని మూడో పాటను ఈనెల 8వ తేదీన విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ‘చమ్కీల అంగీలేసి’ అంటూ సాగే పెళ్లి పాటలో నాని, కీర్తి సురేశ్ స్కూటర్‌‌పై వెళ్తూ, వింటేజ్ లుక్‌లో కనిపిస్తున్న ఫొటోను విడుదల చేశారు. ఈ చిత్రంలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్  ముఖ్యపాత్రలు పోషించారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు.

Nani
Tollywood
dasara
movie
Keerthy Suresh
song

More Telugu News