Saif Ali Khan: మా బెడ్ రూమ్ లోకి వచ్చేయండి.. ఫొటోగ్రాఫర్లపై సైఫ్ అలీఖాన్ గుస్సా.. వీడియో వైరల్!

Saif Ali Khan serious on photographer

  • మలైకా అరోరా తల్లి పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన సైఫ్, కరీనా 
  • పార్టీ తర్వాత ఇంట్లోకి వెళ్తుండగా వెంటపడిన ఫొటోగ్రాఫర్లు
  • ‘ఒక పని చేయండి.. మా బెడ్ రూమ్ లోకి కూడా వచ్చేయండి’ అంటూ సైఫ్ అసహనం

ఫొటోగ్రాఫర్లపై బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ గుస్సా అయ్యారు. ‘ఒక్క ఫొటో’ అంటూ వెంటపడుతుండటంతో మా బెడ్ రూమ్ లోకి వచ్చేయండంటూ అసహనం వ్యక్తం చేశారు. బాలీవుడ్ నటి మలైకా అరోరా తల్లి జాయిస్ అరోరా 70వ పుట్టిన రోజు వేడుకలకు గురువారం రాత్రి తన భార్య, బాలీవుడ్ నటి కరీనా కపూర్ తో కలిసి సైఫ్ వెళ్లారు. పార్టీ తర్వాత ముంబైలోని తమ ఇంటికి వచ్చారు. కారు దిగి ఇంట్లోకి వెళ్తుండగా.. ఫొటోగ్రాఫర్లు వచ్చారు. ఫొటోకు పోజ్ ఇవ్వాలంటూ వారిద్దరినీ ఫాలో అయ్యారు.

అయితే వారిని పట్టించుకోకుండా సైఫ్, కరీనా ముందుకు వెళ్లారు. ఫొటో అంటూ మళ్లీ అడగడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సైఫ్.. ‘‘ఒక పని చేయండి.. మా బెడ్ రూమ్ లోకి కూడా వచ్చేయండి’’ అని అన్నారు. సీరియస్ గా ఇంట్లోకి వెళ్తూ డోర్ క్లోజ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 

ఇటీవల విక్రమ్ వేద సినిమాతో సైఫ్ అలీఖాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో హ‌ృతిక్ రోషన్ కూడా ఇంకో హీరోగా కనిపించారు. ప్రభాస్ హీరోగా ఓం రౌత్ రూపొందించిన ఆదిపురుష్ సినిమాలో రావణుడిగా సైఫ్ నటించారు. ఈ ఏడాదే సినిమా రిలీజ్ కానుంది.

Saif Ali Khan
Kareena Kapoor
Malaika Arora
paparazzi
Bollywood

More Telugu News