GIS-2023: జీఐఎస్-2023లో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు ఇవే!
- విశాఖలో ప్రతిష్ఠాత్మక రీతిలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్
- హాజరైన కార్పొరేట్ దిగ్గజాలు
- పలు భారీ ఒప్పందాలకు వేదికగా జీఐఎస్-2023
విశాఖ నగరంలో ప్రతిష్ఠాత్మక రీతిలో నిర్వహిస్తున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (జీఐఎస్-2023)లో ఏపీ ప్రభుత్వం భారీ స్థాయిలో ఎంవోయూలు కుదుర్చుకుంది. వాటిలో కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువైన ఎంవోయూలు కూడా ఉన్నాయి.
ఎన్టీపీసీ ఎంవోయూ విలువ రూ.2.35 లక్షల కోట్లు కాగా, ఏబీసీ లిమిటెడ్ తో ఒప్పందం విలువ రూ.1.20 లక్షల కోట్లు. ఇక రిలయన్స్ ఏపీలో 10 గిగావాట్ల రెన్యువబుల్ సోలార్ ఎనర్జీ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నట్టు జీఐఎస్ వేదికపై నుంచి ముఖేశ్ అంబానీ ప్రకటించారు. అటు జిందాల్ గ్రూప్ కూడా కృష్ణపట్నం పోర్టు సమీపంలో రూ.10 వేల కోట్లతో 3 మిలియన్ టన్నుల సామర్థ్యం గల ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఆసక్తి చూపింది.
ఇతర ఎంవోయూల వివరాలు...
- జేఎస్ డబ్ల్యూ గ్రూప్- రూ.50,632 కోట్లు
- గ్రీన్ కో- రూ.47,600 కోట్లు
- అరబిందో గ్రూప్- రూ.10,635 కోట్లు
- అదానీ ఎనర్జీ గ్రూప్- రూ.21,820 కోట్లు
- ఆదిత్య బిర్లా గ్రూప్- రూ.9,300 కోట్లు
- టీసీఎల్- రూ.5,500 కోట్లు
- జిందాల్ స్టీల్- రూ.7,500 కోట్లు
- హీరో ఫ్యూచర్ ఎనర్జీస్- రూ.30,000 కోట్లు
- రెన్యూ పవర్- రూ.97,550 కోట్లు
- టీఈపీఎస్ఓఎల్- రూ.65,600 కోట్లు
- ఇండోసాల్- రూ.76,033 కోట్లు
- అవాదా గ్రూప్- రూ.50,000 కోట్లు
- ఏసీఎంఈ- రూ.68,976 కోట్లు
- హంచ్ వెంచర్స్- రూ.50,000 కోట్లు
- ఎకోరెన్ ఎనర్జీ- రూ.15,500 కోట్లు
ఇవేకాకుండా... టీసీఎల్, ఏజీపీ సిటీ గ్యాస్, జేసన్ ఇన్ ఫ్రా, మైహోమ్, డైకిన్, వర్షిణి పవర్, ఏఎం గ్రీన్ ఎనర్జీ, ఐపీసీఎల్, ఆశ్రయం ఇన్ ఫ్రా, సన్నీ ఒపోటెక్, వెనికా హైడ్రల్ పవర్, ఓబెరాయ్ గ్రూప్, టీవీఎస్, ఆంధ్రా పేపర్, అల్ట్రాటెక్, భూమి వరల్డ్, అంప్లస్ ఎనర్జీ, వెల్ స్పన్, హైజెన్ కో, గ్రిడ్ ఎడ్జ్ వర్క్స్, సెల్ కాన్, మంజీరా హోటల్స్, భ్రమరాంబ, డెక్కన్ ఫైన్ కెమికల్స్, లారస్ గ్రూప్, ఎలక్ట్రో స్టీల్ క్యాస్టింగ్స్, ఏస్ అర్బన్ డెవలపర్స్, డ్రీమ్ వ్యాలీ గ్రూప్, విష్ణు కెమికల్స్, ఎమ్మార్ కేఆర్ కన్ స్ట్రక్షన్స్, దివీస్, శారదా మెటల్స్, తుని హోటల్స్, ఉత్కర్ష అల్యూమినియం సంస్థలు కూడా ఏపీ ప్రభుత్వంతో ఎంవోయూలు కుదుర్చుకున్నాయి.