Lavanya Tripathi: పెళ్లిపై లావణ్య త్రిపాఠి స్పందన

Lavanya Tripathi response on marriage

  • ప్రతి ఒక్కరు తన పెళ్లి గురించే మాట్లాడుతున్నారన్న లావణ్య
  • టైమ్ వచ్చినప్పుడు అదే జరుగుతుందని వ్యాఖ్య
  • ఇప్పుడు తన దృష్టి సినిమాలపైనే ఉందన్న అందాల రాక్షసి

ఉత్తరాది భామ లావణ్య త్రిపాఠి టాలీవుడ్ లోకి అడుగుపెట్టి దశాబ్ద కాలం గడిచిపోయింది. 2012లో వచ్చిన 'అందాల రాక్షసి' సినిమాతో ఆమె గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. మరోవైపు ఆమెకు ఇటీవలి కాలంలో పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తాజాగా ఈ అంశంపై ఆమె స్పందిస్తూ... ప్రతి ఒక్కరూ తన పెళ్లి గురించే మాట్లాడుతున్నారని, టైమ్ వచ్చినప్పుడు అదే జరుగుతుందని చెప్పింది.

అసలు పెళ్లి విషయంలో తన తల్లిదండ్రులు కూడా ఒత్తిడి చేయడం లేదని తెలిపింది. తాను పెళ్లి గురించి ఆలోచించడం లేదని, పెళ్లికి సంబంధించిన కలలు తనకు లేవని చెప్పింది. ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమాలపైనే అని తెలిపింది. పెళ్లి మీద తనకు నమ్మకం ఉందని... నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు పెళ్లి జరుగుతుందని చెప్పింది. వ్యక్తిగత విషయాల గురించి బయటకు చెప్పడం తనకు ఇష్టం ఉండదని వ్యాఖ్యానించింది.

Lavanya Tripathi
Tollywood
Marriage
  • Loading...

More Telugu News