Junior NTR: జూనియర్ ఎన్టీఆర్ కు రెండు హెచ్సీఏ అవార్డులు.. ఫొటోలు షేర్ చేసిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్

Two HCA Awards for Junior NTR

  • ఎన్టీఆర్ కు స్పాట్ లైట్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డులు
  • అలియా భట్ కు కూడా అవార్డు
  • వచ్చే వారం అవార్డులను పంపుతామని హెచ్సీఏ ప్రకటన

ఇప్పుడు ప్రపంచ సినీ పరిశ్రమలో 'ఆర్ఆర్ఆర్' హవా నడుస్తోందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆస్కార్ అవార్డుల బరిలో కూడా ఈ సినిమా నిలిచింది. అంతర్జాతీయ వేదికలపై ఈ చిత్రం ఇప్పటికే పలు అవార్డులను సొంతం చేసుకుని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ సత్తాను నలుమూలలకు చాటుతోంది. ప్రఖ్యాత హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అందించే హెచ్సీఏ అవార్డుల్లో సైతం ఐదు అవార్డులను కైవసం చేసుకుంది. స్పాట్ లైట్ అవార్డును రామ్ చరణ్ అందుకున్నాడు. 

మరోవైపు, హెచ్సీఏ అవార్డుల్లో జూనియర్ ఎన్టీఆర్ కు అవార్డు రాకపోవడంపై ఆయన అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో తారక్ కు కూడా అవార్డులు ఉన్నాయని హెచ్సీఏ ప్రకటించింది. తన సినిమా షూటింగ్ బిజీ వల్ల ఆయన అమెరికాకు రాలేకపోయినట్టు తమకు తెలిపారని వెల్లడించింది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కు వచ్చిన అవార్డుల ట్రోఫీలను తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. 'ఆర్ఆర్ఆర్' సినిమాకు గాను స్పాట్ లైట్ అవార్డ్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డులు తారక్ కు వచ్చినట్టు తెలిపింది. దీంతో జూనియర్ అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. స్పాట్ లైట్ అవార్డును అలియా భట్ కు కూడా హెచ్సీఏ ప్రకటించింది.

'డియర్ ఆర్ఆర్ఆర్ సపోర్టర్స్ అండ్ ఫ్యాన్స్... జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్ లకు వచ్చిన అవార్డులను మీతో పంచుకుంటున్నాం. వచ్చే వారం ఈ అవార్డులను వారికి పంపిస్తున్నాం' అని హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ట్వీట్ చేసింది.

Junior NTR
HCA Awards
RRR
Alia Bhatt
Tollywood
Bollywood

More Telugu News