Vizag: ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో అతిథులకు నోరూరించే వంటకాలు... మెనూ చూస్తేనే లొట్టలేస్తారు!

Food menu in AP Global Investors Summit

  • సమ్మిట్ కు దేశ విదేశాల నుంచి విచ్చేసిన అతిథులు
  • రెండు రోజుల పాటు కొనసాగనున్న సమ్మిట్
  • అతిథుల కోసం నోరూరించే వెజ్, నాన్ వెజ్ వంటకాలు

రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాసేపటి క్రితం సమ్మిట్ ప్రారంభమయింది. సమ్మిట్ కు దేశ, విదేశాల నుంచి అతిథులు విచ్చేశారు. వీరికి నోరూరించే వంటకాలను ప్రభుత్వం తయారు చేయిస్తోంది. 

ఈరోజు మధ్యాహ్నం భోజనంలో గుంటూరు కోడి వేపుడు, బొమ్మిడాయల పులుసు, మటన్ కర్రీ, రొయ్యల మసాలా, చికెన్ పలావ్, వెజ్ పలావ్, క్యాబేజీ ఫ్రై, ఆలూ గార్లిక్ ఫ్రై, క్యాప్సికం కర్రీ, మష్రూమ్ కర్రీ, పన్నీర్ బటర్ మసాలా, రోటీ, కుల్చా, మిర్చీ కా సలాన్, మెంతికూర-కార్న్ రైస్, టమోటా పప్పు, బీట్ రూట్ రసం, గోబీ ఆవకాయ, మజ్జిగ పులుసు, ద్రాక్ష పండ్ల పచ్చడి, నెయ్యి, వడియాలతో పాటు ఐస్ క్రీమ్, కాలా జూమూన్, జున్ను, ఫ్రూట్స్ ఉంటాయి. 

రెండో రోజు అయిన రేపు కూడా నోరూరించే వంటకాలు అతిథుల కోసం సిద్ధం కాబోతున్నాయి. రేపటి మెనూలో ఆంధ్ర చికెన్ కర్రీ, చేప ఫ్రై, రొయ్యల కూర, మటన్ పలావ్, ఎగ్ మసాలా, గోంగూర మటన్, రుమాలీ రోటీ, బటర్ నాన్, రష్యన్ సలాడ్స్ ఉంటాయి. వెజ్ సెక్షన్ లో కడాయ్ వెజ్ బిర్యానీ, కరివేపాకు రైస్, పన్నీర్ కర్రీ, బెండకాయ-జీడిపప్పు ఫ్రై, క్యారెట్ బీన్స్ కొబ్బరి ఫ్రై, వంకాయ మెంతి కారం, పప్పుచారు, మిరియాల రసం, మజ్జిగ పులుసు, ఉలవచారు ఉంటాయి. వీటితో పాటు ఐస్ క్రీమ్, ఫ్రూట్స్, అంగూర్ బాసుంది, డబుల్ కా మీఠా అందుబాటులో ఉంటాయి. 

ఉదయం టిఫిన్ విషయానికి వస్తే... హాట్ పొంగల్, టమోటా బాత్, ఇడ్లీ, వడ ఉంటాయి. ఉదయం స్నాక్స్ లో డ్రై కేక్, ప్లమ్ కేక్, వెజ్ బెల్లెట్, స్ఫ్రింగ్ రోల్స్, మఫిన్స్ ఉంటాయి. సాయంత్రం స్నాక్స్ లో చీజ్ బాల్స్, కుకీస్, డ్రై ఫ్రూట్ కేక్, ఫ్రూట్ కేక్, బజ్జీలు, కాఫీ, టీ ఉంటాయి.

More Telugu News