CM KCR: ఫాక్స్ కాన్ తో తెలంగాణ సర్కారు ఒప్పందం వేళ ఆసక్తికర సంఘటన

CM KCR wishes Foxconn Chairman Young Liu on his birthday

  • సీఎం కేసీఆర్ తో ఫాక్స్ కాన్ బృందం భేటీ
  • నేడు ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ ల్యూ పుట్టినరోజు
  • స్వదస్తూరీతో రూపొందించిన గ్రీటింగ్ కార్డు ఇచ్చిన సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రభుత్వానికి ఫాక్స్ కాన్ రూపంలో భారీ పెట్టుబడులు వస్తుండడం తెలిసిందే. ఇవాళ సీఎం కేసీఆర్ తో ప్రపంచస్థాయి ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థ ఫాక్స్ కాన్ ప్రతినిధి బృందం సమావేశమై ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సమావేశంలో ఫాక్స్ కాన్ సంస్థ చైర్మన్ యంగ్ ల్యూ స్వయంగా పాల్గొనడం విశేషం. 

ఈ సందర్భంగా ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఇవాళ యంగ్ ల్యూ పుట్టినరోజు అని తెలుసుకున్న సీఎం కేసీఆర్ తన సొంత చేతిరాతతో రూపొందించిన గ్రీటింగ్ కార్డును ఆయనకు అందజేశారు. ఆయనకు ఓ వీణ బొమ్మను కూడా బహూకరించారు. ఆ తైవాన్ వ్యాపార దిగ్గజానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రగతి భవన్ లో యంగ్ ల్యూ, ఆయన ప్రతినిధి బృందానికి తెలంగాణ వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు.

CM KCR
Young Liu
Foxconn
Birthday
Hyderabad
  • Loading...

More Telugu News