Narendra Modi: మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ స్పందన

Modi opines on three states election results

  • నేడు మూడు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు
  • నాగాలాండ్, త్రిపురలో బీజేపీ కూటమి విజయం
  • మేఘాలయలో కీలకం కానున్న బీజేపీ
  • ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఎంతో ప్రేమను చూపారన్న మోదీ

ఈశాన్య రాష్ట్రాలు నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ ఎన్నికల ఫలితాలు నేడు వెల్లడైన సంగతి తెలిసిందే. నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లో బీజేపీ కూటములనే విజయం వరించింది. ఈ నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మేఘాలయలో సంకీర్ణం ఏర్పడనుండగా, బీజేపీ కీలకపాత్ర పోషించనుంది. 

ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ సభలో మోదీ మాట్లాడుతూ.... ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఎంతో ప్రేమను చూపించారని కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని పేర్కొన్నారు. విజయం కంటే ప్రజలు చూపించే ప్రేమ ఎంతో సంతోషాన్నిస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యం పట్ల ప్రజల్లో ఉన్న దృఢమైన విశ్వాసానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని వివరించారు. 

ఈశాన్య రాష్ట్రాలు ఢిల్లీకి దూరంగా ఉండొచ్చేమో కానీ, తన హృదయానికి మాత్రం దగ్గరగానే ఉంటాయని మోదీ వ్యాఖ్యానించారు. ఇక, ఓటమిని తట్టుకోలేని కొందరు ఈవీఎంలను తప్పుబడుతున్నారని విమర్శించారు.

More Telugu News